అంకితభావం, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు

ABN , First Publish Date - 2022-05-25T07:00:49+05:30 IST

ఆట పట్ల అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నత శిఖరాలను అధి రోహించవచ్చునని ఏపీ బ్యాడ్మింటన్‌ సంఘం సంయుక్త కార్యదర్శి చుండ్రు గోవిందరాజులు అన్నారు.

అంకితభావం, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు
సాత్విక్‌ సాయిరాజ్‌, కృష్ణప్రసాద్‌కు సత్కారం

క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్‌, కృష్ణప్రసాద్‌కు సత్కారం
కాకినాడ స్పోర్ట్స్‌, మే 24:  ఆట పట్ల అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నత శిఖరాలను అధి రోహించవచ్చునని ఏపీ బ్యాడ్మింటన్‌ సంఘం సంయుక్త కార్యదర్శి చుండ్రు గోవిందరాజులు అన్నారు.  కాకినాడ టౌన్‌ హాల్‌లో మంగళవారం కాకినాడ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం ఆధ్వర్యంలో థామస్‌ కప్‌ బ్యా డ్మింటన్‌ విజేతలైన రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌, గరగ కృష్ణప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. కేబీఏ వ్యవస్థాపకుడు కర్రి భామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో గోవిందరాజులు మాట్లాడుతూ థామస్‌ కప్‌ విజేతలు కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన వారు కావడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. వారిని స్ఫూ ర్తిగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు తయారు కావాలన్నారు. భామిరెడ్డి మాట్లాడుతూ ఆఫీసర్స్‌ క్లబ్‌లో బ్యాడ్మింటన్‌ ఆడే క్రీడాకారులు నేడు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. టౌన్‌ హాల్‌ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, బ్యాడ్మింటన్‌ సీనియర్‌ క్రీడాకారులు బి.కృష్ణమూర్తి, రంగబాబు, సాత్విక్‌ తండ్రి కాశి క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం విజేతలు కృష్ణప్రసాద్‌, సాత్విక్‌ తమ విజయాన్ని కృష్ణప్రసాద్‌ తండ్రి గంగాధర్‌కు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించి భావోద్వేగానికి లోనయ్యారు. విజేతలకు చెరో ఐదు గ్రాముల చొప్పున టీటీడీ బంగారు లాకెట్లను గోవిందరాజులు బహూకరించారు. టౌన్‌ హాల్‌ క్లబ్‌లో ఇద్దరికీ శాశ్వత సభ్యత్వం ప్రకటించారు. జిల్లాకు చెందిన పలువురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు, అకా డమీ నిర్వాహకులు విజేతలను బొకేలతో సత్క రించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శేషగిరి, బ్యాడ్మింటన్‌ సంఘ సభ్యులు కృష్ణంరాజు, స్పర్జన్‌రాజు, డీఎస్‌ఏ కోచ్‌ చిన్నారి, మూర్తి, చక్రధర్‌, చామంతి నాగేశ్వరరావు, బాపిరాజు, రంగారావు, టౌన్‌ హాల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T07:00:49+05:30 IST