మహిళా వర్సిటీ లా కోర్సులో ప్రవేశానికి 19 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-04-18T07:20:05+05:30 IST

పద్మావతి మహిళా యూనివర్సిటీ లా విభాగం నిర్వహించే కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

మహిళా వర్సిటీ లా కోర్సులో ప్రవేశానికి 19 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఏప్రిల్‌ 17: పద్మావతి మహిళా యూనివర్సిటీ లా విభాగం నిర్వహించే కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఏపీ లా సెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థినులు దీనికి అర్హు లు. మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశానికి ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. అర్హులైన విద్యార్థి నులు టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌ కార్డు, టీసీ, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకొచ్చి అడ్మిషన్‌ పొందవచ్చని వర్సిటీ లా విభాగాధిపతి సీతాకుమారి సూచించారు.

Updated Date - 2021-04-18T07:20:05+05:30 IST