మచ్చలు పోతాయిలా..!
ABN , First Publish Date - 2021-04-24T07:00:50+05:30 IST
రాత్రి పడుకునే ముందు తేనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఒకవేళ చర్మం తెగిన గాట్లు ఉంటే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే మంటను కలిగించే గుణం తేనెకు ఉంది.
- రాత్రి పడుకునే ముందు తేనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఒకవేళ చర్మం తెగిన గాట్లు ఉంటే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే మంటను కలిగించే గుణం తేనెకు ఉంది.
- కలబందకు మచ్చలను పోగొట్టే గుణం ఉంది. అంతే కాకుండా దెబ్బతిన్న చర్మకణాలు తిరిగి పునర్నిర్మాణం అయ్యేందుకు తోడ్పడుతుంది. రోజుకు రెండు సార్లు కలబందను ముఖానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.