మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలి

Jun 17 2021 @ 01:07AM
రాస్తారోకో చేస్తున్న రైతులు

చందుర్తి, జూన్‌ 16: వర్షంతో తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కట్ట లింగంపేట గ్రామంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై బధవారం రాస్తా రోకో చేశారు.  కలెక్టర్‌ రావాలని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. లారీ డ్రైవర్లకు బస్తాకు రెండు రూపాయలు ఇస్తేనే ధాన్యం తరలిస్తున్నారని  ఆరోపించారు. అనంతరం అక్కడికి చేరుకున్న సింగిల్‌ విండో చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌ ఈ నెల 19 వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.  రైతులు ఏనుగుల శ్రీనివాస్‌, లక్ష్మణ్‌రావు, దశరథం, కొమురయ్య, నరేష్‌  పాల్గొన్నారు.

Follow Us on: