Visakhapatnam: సైకో కిల్లర్ రాంబాబు అరెస్ట్

ABN , First Publish Date - 2022-08-16T23:53:04+05:30 IST

సైకో కిల్లర్ రాంబాబు (Spycho Killer Rambabu)ను అరెస్ట్ చేశామని సీపీ సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు. వారంరోజుల్లో 3 హత్యలు చేశాడని ఆయన చెప్పారు. నిందితుడు..

Visakhapatnam: సైకో కిల్లర్ రాంబాబు అరెస్ట్

విశాఖ: (Vijayawada): సైకో కిల్లర్ రాంబాబు(Spycho Killer Rambabu)ను అరెస్ట్ చేశామని సీపీ సీహెచ్ శ్రీకాంత్ (Visakhapatnam Cp Ch Srikanth) తెలిపారు. వారంరోజుల్లో 3 హత్యలు చేశాడని ఆయన చెప్పారు. నిందితుడు అనకాపల్లి జిల్లా కోటవురట్ల వాసిగా గుర్తించినట్లు సీపీ సీహెచ్ శ్రీకాంత్  పేర్కొన్నారు. 


‘‘ రాంబాబు 2018లో అనుమానంతో భార్యను హత్య చేశాడు. 2018లో భార్య వివాహేతర సంబంధం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. కక్ష పెంచుకుని మహిళలను హత్య చేస్తున్నాడు. వారం రోజులు క్రితం వాచ్‌మెన్ దంపతులను హత్య చేశాడు. తాను చంపిన వాళ్ళలో మహిళ ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్‎ను చూసేవాడు. తరువాత వాటిపై తన్నేవాడు. వారం తరువాత మరో మహిళను హత్య చేశాడు. మొత్తం మూడు హత్యలు చేశాడు. మరొకరిపై హత్యాయత్నం చేశాడు. రాడ్డుతో తలపై మోది చంపాడు. వాచ్ మెన్‌లు అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుందని వాళ్ళను ఎంచుకున్నాడు. కొద్దినెలల నుంచి రాంబాబు మానసిక పరిస్థితి బాగాలేదు. తను అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడు. దేవుడు వస్తున్నాడంటూ పిచ్చి పిచ్చిగా కేకలు వేసేవాడు. దీంతో వారు ఇంటికి తాళం వేసి పంపించేశాడు. రాంబాబుకు కూతురు (26), కుమారుడు (27) ఉన్నారు. ఇద్దరు తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‎లో పని చేశాడు. అలాగే ఆటో నడిపేవాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఉన్నాయా లేదా అనేది విచారణ చేశాం. మరోసారి రాంబాబును కస్టడీకి తీసుకొని విచారణ చేస్తాం.’’ అని సీహెచ్ శ్రీకాంత్ తెలిపారు.  


Updated Date - 2022-08-16T23:53:04+05:30 IST