శ్రీగిరిలో వేదసభ

ABN , First Publish Date - 2021-01-17T05:27:08+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు సేవలను సంపూర్ణం గా జరిపించాలనే భావనతో శనివారం వేదసభ కార్యమాన్ని నిర్వహించారు.

శ్రీగిరిలో వేదసభ
వేదసభలో అర్చకస్వాములు, వేదపండితులు

శ్రీశైలం, జనవరి 16: శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు సేవలను సంపూర్ణం గా జరిపించాలనే భావనతో శనివారం వేదసభ కార్యమాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం పూర్ణాహుతి సమర్పించారు. ముందుగా స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ వేదసభ కార్యక్రమంలో స్థానిక వేదపండితులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అర్చకస్వాములు, వేదపండి తులు, అధ్యాపకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించా రు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు గణపతి పూజ చేశారు. అనంతరం ఋత్విగ్వరణ కార్యక్రమంలో ఉభయదే వాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు, ఈవో కేఎస్‌ రామరావు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మూడు గంటల పాటు వేదపారాయణాలు చేశారు. సాయంకాలం రెండు గంటల పాటు స్వామిఅమ్మవార్ల కైంకర్యంగా ఘనస్వస్తి నిర్వహించారు

Updated Date - 2021-01-17T05:27:08+05:30 IST