IPL 2022: SRH vs DC మ్యాచ్ Preview.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే..

Published: Thu, 05 May 2022 17:22:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
IPL 2022: SRH vs DC మ్యాచ్ Preview.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే..

ముంబై: IPL 2022లో భాగంగా గురువారం రాత్రి మరో ఆసక్తికర పోరు ముంబై బ్రబౌన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న SunRisers Hyderabad, ఏడో స్థానంలో ఉన్న Delhi Capitals జట్ల మధ్య గురువారం రాత్రి జరగబోయే మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. SRH జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 5 గెలిచి, నాలుగింటిలో ఓడిపోగా.. DC జట్టు 9 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో Sunrisers Hyderabad జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. SRH జట్టు బౌలింగ్ బలంగా ఉందని అప్పటివరకూ అనిపించినా చెన్నై బ్యాటింగ్ ధాటికి బౌలర్లు విలవిలలాడిన పరిస్థితి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా గత మ్యాచ్‌లో లక్నో జట్టు చేతిలో ఓడి తర్వాత మ్యాచ్‌లో గెలుపు కోసం గట్టిగానే కసరత్తు చేసింది.


ఇక.. ఇవాల్టి మ్యాచ్ విషయానికొస్తే ఇరు జట్లు ఈ సీజన్లో తొలిసారి తలపడబోతున్నాయి. ఇరు జట్లలో ఆటగాళ్ల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. SRH జట్టులో వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది. ఇంతకు మించి SRH టీంలో పెద్దగా మార్పులుచేర్పులు ఉండకపోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ అహ్మద్ ఆడే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164. ఛేజింగ్ చేసిన టీమ్‌కు 60 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయి.


ఇక.. ఆటగాళ్ల ఫామ్ విషయానికొస్తే.. ఢిల్లీ బ్యాటింగ్‌లో పృధ్వీ షా ఫామ్ పర్వాలేదనిపిస్తున్నా నిలకడగా ఆడుతుండకపోవడం DC ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. వార్నర్ ఈ సీజన్‌లో 264 పరుగులు చేసి మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మిచ్చెల్ మార్ష్ కోవిడ్ నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. ఢిల్లీ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ బాగా రాణిస్తున్నాడు. 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి సత్తా చాటాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. SRH ఆటగాళ్ల ఫామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. బ్యాటింగ్‌పరంగా అభిషేక్ శర్మ మెప్పిస్తున్నాడు. జట్టు గెలుపోటములు పక్కన పెడితే ఈ యువ ఆటగాడు మినిమమ్ గ్యారంటీ బ్యాటింగ్ ఆడుతూ SRH అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.


SRH జట్టు కెప్టెన్ విలియంసన్ ఫామ్ కొంత ఆందోళన కలిగిస్తోంది. మర్క్రమ్ మంచి ఫామ్‌లో ఉండటం SRH టీంకు కలిసొచ్చే అంశం. రాహుల్ త్రిపాఠి గత మ్యాచ్‌లో నిరాశపరిచినా అభిమానుల అతని బ్యాటింగ్‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు. బౌలింగ్‌పరంగా భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఆశాజనకంగానే కనిపిస్తున్నా ఉమ్రాన్ మాలిక్, జాన్సెన్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తుంది. ఈ ఇద్దరు బౌలర్లు ఒక మ్యాచ్‌లో అదరగొడుతున్నా మరో మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక.. టాస్ విషయానికొస్తే.. SRH కెప్టెన్ కేన్ మామకు టాస్ కలిసొస్తోంది. 9 మ్యాచులు SRH ఆడితే 8 మ్యాచ్‌ల్లో టాస్ కేన్ మామే గెలవడం విశేషం. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గురువారం రాత్రి 7.30కు మ్యాచ్ మొదలుకానుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.