Asia Cup: బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

ABN , First Publish Date - 2022-09-02T01:06:06+05:30 IST

ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్

Asia Cup: బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచిన శ్రీలంక

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు ఎంతో కీలకం కానుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్థాన్ చేతిలో శ్రీలంక దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు, అదే ఆఫ్ఘనిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఖాతా తెరవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై శ్రీలంకకు మంచి రికార్డు ఉంది. ఇరు జట్లు 12 సార్లు తలపడగా శ్రీలంక 8 మ్యాచుల్లో విజయం సాధించగా, బంగ్లాదేశ్ నాలుగు విజయాలతోనే సరిపెట్టుకుంది.

Updated Date - 2022-09-02T01:06:06+05:30 IST