Sri Lanka Crisis: శ్రీలంక ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి..

ABN , First Publish Date - 2022-06-28T05:10:19+05:30 IST

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ విక్రయాన్ని కూడా..

Sri Lanka Crisis: శ్రీలంక ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి..

కొలంబో: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా పెట్రోల్, డీజిల్ విక్రయాన్ని కూడా ఆ దేశం నిలిపివేసింది. జులై 10 వరకూ కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి Bandula Gunawardana తాజాగా ప్రకటించారు. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి ఇంధన అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో.. వాహనదారులపై పిడుగు పడినట్టయింది. తమ దేశంలో ఉన్న ఇంధనాన్ని నిల్వ చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. 

Updated Date - 2022-06-28T05:10:19+05:30 IST