Sri Lankaలో ఘర్షణలు.. ఎంపీ ఆత్మహత్య.. నిరసనకారుల ఉగ్రరూపం..

ABN , First Publish Date - 2022-05-10T03:24:14+05:30 IST

కొలంబో : శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రాజేసిన రాజకీయ చిచ్చు మరింత ముదిరి తీవ్ర అల్లర్లకు దారితీసింది. ప్రధానమంత్రి మహింద రాజపక్స విధేయులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య సోమవారం తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నారు.

Sri Lankaలో ఘర్షణలు.. ఎంపీ ఆత్మహత్య.. నిరసనకారుల ఉగ్రరూపం..

కొలంబో : శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం రాజేసిన రాజకీయ చిచ్చు మరింత ముదిరి తీవ్ర అల్లర్లకు దారితీసింది. ప్రధానమంత్రి మహింద రాజపక్స విధేయులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య సోమవారం తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నారు. ఈ ఘర్షణలో అధికార పార్టీ ఎంపీ మాజీ అమరకీర్తి అతుకోరలా ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిరసనకారులు తన కారును చుట్టుమట్టడంతో కారులోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అంతకుముందు ఆయన సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డగించారు. ఆయన కారుపై ఎక్కి నిరసన తెలిపారు. పెద్ద మొత్తంలో జనాలు చుట్టుముట్టడంతో భయంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన భద్రతా అధికారి కూడా కన్నుమూశారని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం జరిగిన భయానక అల్లర్లలో అనేకమంది నిరసనకారులు కూడా గాయపడ్డారు. సాయంత్ర సమయంలో రాజపక్స సోదరుల తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన మెమోరియల్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మరో ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లకు కూడా నిప్పటించారు. కాగా తీవ్ర పరిస్థితుల దృష్ట్యా కొలంబోలో తక్షణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు.


కాగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మొదలయ్యాక అతిపెద్ద ఘర్షణలు సోమవారం ఉదయం మొదలయ్యాయి. అధ్యక్ష కార్యాలయం వెలుపల ఆందోళనలు చేపడుతున్న నిరసనకారులపై రాజపక్స కుటుంబ మద్దతుదారులు విరుచుకుపడడం అల్లర్లకు దారితీసింది. నిరాధులైన నిరసనకారులపై రాజపక్స విధేయులు దాడులకు పాల్పడ్డారు. దీంతో నిరసనకారులు  ప్రతిఘటించారు. దీంతో మహిందా రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్చి వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది.

Read more