శ్రీరామ సాగర్‌కు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2020-09-17T11:09:39+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వర ద పోటెత్తింది. గోదావరి, మంజీరాల నుంచి ఒకేసారి వరద రావడంతో బుధవారం ఉదయం ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి రెండు లక్షల క్యూ

శ్రీరామ సాగర్‌కు పోటెత్తిన వరద

40 గేట్లనె ఎత్తి 2.21 లక్షల క్యూ సెక్కుల నీటి విడుదల


నిజామాబాద్‌  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) సెప్టెంబరు 16 : శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు వర ద పోటెత్తింది. గోదావరి, మంజీరాల నుంచి ఒకేసారి వరద రావడంతో బుధవారం ఉదయం ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి రెండు లక్షల క్యూ సెక్కుల వరదను  గోదావరిలోకి వదిలారు. వరద అంతకంతకు పెరగడంతో 2లక్షల 21వేల క్యూసెక్కుల వరకు వదిలారు. మధ్యాహ్నానికి వరద తగ్గుముఖం పట్టడడంతో  అధికారులు 16 గేట్లను మూసివేశారు. అర్ధరా త్రి నుంచి ప్రాజెక్టు వద్దే ఉన్న అధికారులు వరద ప్రవాహాన్ని బట్టి గేట్లను తెరిచి దిగువకు నీటిని వదిలారు. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వరద తగ్గడంతో గేట్ల సంఖ్యను తగ్గించి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువనున్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు ప్రాంతమైన జిల్లా, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల పరిధిలో సోమ, మంగళవా రం ఉదయం వరకు భారీ వర్షం పడింది.


మహారాష్ట్రలోని ప్రాజెక్టు నుంచి 75వేల క్యూసెక్కుల వరద రాగా మంజీరా తో పాటు వాగుల నుంచి భారీగా వరద వచ్చింది. వీటితో పాటు నిర్మల్‌ జిల్లా గడెన్న వాగు నుంచి కూడా వరద వచ్చి చేరింది. బాన్సువాడ డివిజన్‌లో భారీ వర్షం పడడం వల్ల మంజీరా నుంచి వరద ఎక్కువగా వచ్చింది. ప్రాజెక్టులోకి మంగళ వారం అర్ధరాత్రి నుంచి వరద పెరిగి ంది. ప్రాజెక్టులోకి అర్ధరాత్రి దాటిన తర్వాత లక్ష క్యూసెక్కులకు పైగా వరద రావడంతో 40 గేట్లను ఎత్తివే శారు. వరద పెరగడం వల్ల కందకుర్తి వద్ద నీటి మట్టం పెరిగి మంజీరా నీటిని ఆపడంతో గేట్ల ఎత్తుకు ఎత్తారు. ఉదయం ఐదు గంటల సమయంలో వరద రెండు లక్షల క్యూసెక్కులకు పైగా రావడంతో అంతే మొత్తాన్ని గోదావరికి వదిలారు. బుధవారం ఉదయం 7 గంటలకు 2లక్షల 21వేల క్యూసెక్కుల వరకు వరద రావడంతో నీటి విడుదలను పెంచారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరద తగ్గడంతో 16 గేట్లను మూసివేశారు.


ప్రాజెక్టు నుంచి 24 గేట్ల ద్వారా 96వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి అర్ధరాత్రి నుంచే వరద పెరగుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరద ఉధృతిని బట్టి గేట్లను ఎత్తారు. ప్రాజెక్టులో మొత్తం 42 గేట్లు ఉండగా 40 గేట్లను ఎత్తారు. గత సంవత్సరం 42 గేట్లను ఎత్తివరద విడుదల చేశారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి బుధవారం 50వేల క్యూసెక్కుల వరద రావడం, ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మళ్లీ వర్షాలు ఉంటే పెరిగే అవకాశం ఉన్నందున వరదను పరిశీలిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగు లను కొనసాగిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి కెపాసిటీ 90.334 టీఎంసీలు ఉండే విధంగా చూస్తున్నారు. పై నుంచి వచ్చే వరదను గేట్లతో పాటు కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల కొనసాగిస్తున్నారు.


విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎస్కేప్‌ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. వరద కాలువ గేట్లను మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో సోన్‌ బ్రిడ్జి వద్ద వరద గోదావరి అంతా పరుచుకుని పారుతోంది. జాతీయ రహదారి గుండా వేళ్లేవారు ఆగి వరద చూస్తూ వెళ్లడం కనిపించింది. పోచంపాడు ప్రాజెక్టు నుంచి 40గేట్లను ఎత్తి వరద నీటిని విడుదల చేసిన అధికారులు జిల్లాతో పాటు నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధికారులను అప్రమ త్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీగా నీటిని విడుదల చేసినందున సమీప గ్రామాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తును పెంచారు. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతంలో వర్షాలు పడినందున వరద పెరిగిందని ప్రాజెక్టు ఈఈ రామారావు, డీఈ జగదీశులు తెలిపారు. వరద అర్ధరాత్రి పెరగడంతో 40 గేట్లను ఎత్తామన్నారు. పై నుంచి వరద తగ్గడం వల్ల గేట్లను తగ్గించామన్నారు. ఈ వరద మరికొన్ని రోజుల పాటు వస్తుందని వారు తెలిపారు. 

Updated Date - 2020-09-17T11:09:39+05:30 IST