Varsity: శ్రీరామచంద్రా వర్సిటీలో సాంస్కృతిక మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-13T15:24:42+05:30 IST

‘శ్రీ రామచంద్రా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’లో శుక్రవారం మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీచే సాంస్కృతిక మహోత్సవం

Varsity: శ్రీరామచంద్రా వర్సిటీలో సాంస్కృతిక మహోత్సవం

చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘శ్రీ రామచంద్రా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’లో శుక్రవారం మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీచే సాంస్కృతిక మహోత్సవం జరిగింది. వివిధ మేనేజ్‌మెంట్‌ కళాశాలల నుంచి వెయ్యిమందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంటిగ్రా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ సీఓఓ ఎం.వెంకటేశన్‌ మాట్లాడుతూ.. సమకాలీన డొమైన పరిజ్ఞానంతో పాటు రాణించాలంటే విశ్లేషణాత్మక నైపుణ్యం, నెట్‌వర్కింగ్‌(Networking), స్టోరీ టెల్లింగ్‌ అవసరమని పేర్కొన్నారు. వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ పీవీ విజయరాఘన్‌(Dr. PV Vijayaraghan) మాట్లాడుతూ.. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుగా ప్రారంభమైన ఈ కోర్సు ఇప్పుడు ఇతర రంగాల్లోకి విస్తరించి, రాబోయే కాలంలో పెద్ద బిజినెస్‌ స్కూల్‌గా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-13T15:24:42+05:30 IST