‘శ్రీచైతన్య’ వినూత్న పథకం..!

ABN , First Publish Date - 2021-12-15T14:30:33+05:30 IST

లక్ష్యం ఘనమైనదైనప్పుడు..

‘శ్రీచైతన్య’ వినూత్న పథకం..!

‘ఇన్ఫినిటీ లెర్న్‌’

‘స్కోర్‌’తో ఫీజులో రూ.వెయ్యి కోట్ల రాయితీ


అమరావతి: లక్ష్యం ఘనమైనదైనప్పుడు సాధించే మార్గం అత్యున్నతమై ఉండాలి. అలాగే అందుకు వీలు కల్పించే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టకూడదు. విశ్వ విఖ్యాత సంస్థల్లో చేరి ఇంజనీర్లు లేదంటే డాక్టర్లు కావాలనుకున్నప్పుడు అందుకు కేవలం తెలివితేటలు ఒక్కటే  సరిపోవు. సరైన గైడెన్స్‌ అవసరమవుతుంది. స్మార్ట్‌ స్టడీతోనే సాధ్యమవుతుంది. అందుకు మార్గాన్ని ‘శ్రీచైతన్య’ చూపిస్తోంది. అదెలాగంటే...


తెలివైన విద్యార్థులకు విలువైన అవకాశాన్ని అందిస్తోంది శ్రీచైతన్య విద్యా సంస్థలు. మంచి సౌకర్యాలతో కూడిన చదువు, మార్గదర్శకత్వం కోసం వ్యయభారం తప్పదు. అయితే ఒక పరీక్ష పెట్టి అందులో నెగ్గుకు వచ్చిన తెలివైన విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పిస్తోంది శ్రీచైతన్య. మూడు నుంచి పదో తరగతిలోపు విద్యార్థులు ఈ అవకాశాన్ని పొందవచ్చు. వారి ప్రతిభను బట్టి ఫీజులో రాయితీ ఏకంగా 50 నుంచి 100 శాతంగా ఆఫర్‌ చేస్తోంది. అందుకోసం రూ.వెయ్యి కోట్లను కేటాయించింది. టెస్ట్‌ని ఆఫ్‌లైన్‌ లేదంటే ఆన్‌లైన్‌లో రాసుకోవచ్చు. పైపెచ్చు తమకు అనుకూలమైన తేదీలనూ ఎంచుకోవచ్చు. తెలివైన విద్యార్థులూ వెంటనే రంగంలోకి దిగి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు.  



మెరిట్‌తో రాయితీ: సుష్మ బొప్పన

ఇండియాస్‌ లార్జెస్ట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ‘స్కోర్‌’ను తాము చేపట్టామని శ్రీచైతన్య - ఇన్ఫెనిటీ లెర్న్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన వెల్లడించారు. అత్యుత్తమ విద్యా బోధన కావాలనుకునే విద్యార్థులు తమ సంస్థలో 3 నుంచి 12వ తరగతిలో చేరవచ్చని, ఈ టెస్ట్‌లో సాధించిన ‘స్కోర్‌’ ఆధారంగా  50 నుంచి 100 శాతం వరకు ఫీజు చెల్లింపులో రాయితీ పొందవచ్చని తెలిపారు. ఈ టెస్ట్‌ డిసెంబర్‌ 18, 19, 26 అలాగే 2022 జనవరి 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌లో, డిసెంబర్‌ 19, 26 అలాగే 2022 జనవరి 2, 3 తేదీల్లో ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించి తమకు అనువైన తేదీ, స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.  


రిజిస్ట్రేషన్‌, వివరాలకు లింక్‌:  www.infinitylearn.com/score

ఫోన్‌ నంబర్‌: 04071045046 


లక్షల మందితో పోటీ

ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థల్లో జేఈఈ రాయాల్సి ఉంటుంది. ఇది మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. మన దేశంలో మెడిసిన్‌ చేయాలంటే ‘నీట్‌’ రాయాల్సిందే. ఈ రెండు పరీక్షలకు పోటీ పడే విద్యార్థులు లక్షల్లోనే ఉంటారు. అలాగే ఈ రెండూ జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలు. స్టేట్‌ సిలబస్‌తో ప్రిపేరయ్యే వారికి ఇది మరింత ప్రయోజనం. తెలుగు మీడియంలో ఆ పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిర్దేశిత సిలబ్‌సలో అదనపు పాఠ్యాంశాలకు మెటీరియల్‌ లభ్యత కూడా అంతంత మాత్రమే. ఇలాంటివే మరికొన్ని వాస్తవాలపై కూడా అవగాహన లభించాలంటే శ్రీచైతన్యలో కోచింగ్‌ చాలా అవసరం.


లాంగ్‌టర్మ్‌ వారికీ ర్యాంకులు

కొద్దిమంది తొలిసారి లక్ష్యాన్ని ఛేదించ లేకపోయినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లాంగ్‌టర్మ్‌తో ప్రయోజనాలు ఎక్కువ. ఫలితాలకు సంబంధిత గణాంకాలే నిదర్శనం. సరిగ్గా అలాంటి విద్యార్థుల కోసమే శ్రీచైతన్య ‘ఇన్ఫినిటీ లెర్న్‌’ హైప్లెక్స్‌ పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు అర్థం అయ్యేలా చెప్పాలంటే ‘నేర్చుకోవడానికి అంతే లేదన్నది’ ఈ స్కీమ్‌ సారాంశం. రిపీటర్స్‌ ముఖ్యంగా బేసిక్స్‌ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సిలబ్‌సపై కూడా వారికి అవగాహన ఉంటుంది. రెగ్యులర్‌ స్టడీస్‌లో భాగంగానే ఈ రెంటినీ తెలుసుకుంటారు. కేవలం లోపాలను తెలుసుకుని సవరించుకోవడం ద్వారా ర్యాంకులు సాధించేందుకు శ్రీచైతన్య నిర్వహిస్తున్న లాంగ్‌ టెర్మ్‌/ రిపీటర్స్‌ ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతుంది. ఎందరెందరో విద్యార్థులు ఈ మార్గంలో తమ కలలను సాకారం చేసుకుంటున్నారు కూడా.


టాప్‌ టెన్‌, టాప్‌ హండ్రెడ్‌లో వెయ్యి వరకు ర్యాంకులు సాధించిన వారికి గైడెన్స్‌ అందించే ఫ్యాకల్టీ వీరికి కూడా మార్గనిర్దేశం చేస్తారు. ఏటా వారు అందించే మెటీరియల్‌, టెస్ట్‌ పేపర్లు, ఆలిండియా ర్యాంకింగ్‌ సిస్టమ్‌ వంటి పద్ధతులను అమలు చేసి మరీ ఈ ఫలితాలను సాధిస్తున్నారు. వీక్లీ, మంత్లీ, గ్రాండ్‌ టెస్టులు నిర్వహించి, పరీక్షపై పట్టు సాధించేలా కృషి చేస్తారు. ప్రతి టెస్టులో క్లాస్‌, క్యాంపస్‌, స్టేట్‌, ఆలిండియా ర్యాంకులు ఇవ్వడం ద్వారా విద్యార్థులు తాము ఎక్కడ ఉన్నారు, తమ కల నెరవేరేందుకు మరెంతగా ఎదగాలి అన్నది తెలియజేస్తారు. అందుకు అవసరమైన సలహాలను ఎప్పటికప్పుడు ప్రతి విద్యార్థికి తన పర్ఫార్మెన్స్‌ను అనుసరించి వ్యక్తిగతంగా తెలియజేస్తారు. ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా తన లోపాలను వివరించడమే కాదు, వాటిని అధిగమించడం కూడా చెబుతారు. అంటే ఇండివిడ్యువల్‌ కేర్‌ తీసుకుంటారు. ప్రోగ్రెస్‌ ఎప్పటికప్పుడు తెలుస్తుండటంతో విద్యార్థి కూడా శ్రద్ధ పెట్టేందుకు, తద్వారా మెరుగుపడేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. 


హైప్లెక్స్‌ - హైబ్రిడ్‌ ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇన్ఫినిటీ లెర్న్‌ ప్రోగ్రామ్‌ను రిజల్ట్‌ ఓరియెంటెడ్‌ స్కీమ్‌ కింద శ్రీచైతన్య మలిచింది. ముఖ్యంగా డిజిటల్‌ ఫీచర్స్‌ను అనుసంధానం చేస్తోంది. మొదటిసారి ర్యాంక్‌ పొందలేక నిరుత్సాహపడిన విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ బోర్డుతో టీచింగ్‌, క్లాస్‌వర్క్‌, స్పెషల్‌ అసైన్‌మెంట్స్‌, హోమ్‌వర్క్స్‌ మానిటరింగ్‌ అలాగే మాస్టర్‌ క్లాసె్‌సతో వీక్లీ రివిజన్‌, ఎక్స్‌ప్లనేషన్‌, క్యుమిలేటివ్‌, గ్రాండ్‌ టెస్టులు, పరీక్షల తరవాత అనాల్సిస్‌ రిపోర్ట్‌, గ్రాఫికల్‌ అనాల్సిస్‌ రిపోర్ట్‌, పేరెంట్స్‌కి అకడమిక్‌ రిపోర్టు వంటి ప్రయోజనాలన్నీ ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంటాయి.   


గడచిన మూడున్నర దశాబ్దాలకు మించిన అనుభవంలో 80 వేలకు పైగా డాక్టర్లు, లక్షల్లో ఇంజనీర్లను దేశానికి అందించిన ఘన చరిత్ర శ్రీచైతన్య విద్యా సంస్థలది. టీచింగ్‌, ప్రాక్టీస్‌, టెస్టింగ్‌, అనాల్సి్‌సతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా అత్యున్నత విజయాలను శ్రీచైతన్య సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 70 శాతం మెడిసిన్‌ సీట్లను సాధిస్తోందంటే అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఇది అందరికీ తెలిసిన చరిత్రే.


Updated Date - 2021-12-15T14:30:33+05:30 IST