Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినిమాల్లోకి వస్తానంటే.. శ్రీదేవి ఏమని సలహా ఇచ్చిందంటే..

Published: Sun, 07 Aug 2022 18:08:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Janhvi Kapoor: జాన్వీ కపూర్ సినిమాల్లోకి వస్తానంటే.. శ్రీదేవి ఏమని సలహా ఇచ్చిందంటే..

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak)తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అకాల మరణం చెందింది. జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తా అని చెప్పినప్పుడు శ్రీదేవి ఇందులోకి రావొద్దని సలహా ఇచ్చింది. ఈ విషయాన్ని జాన్వీ కపూరే చెప్పింది.  


జాన్వీ కపూర్ తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనేక కబుర్లను వివరించింది. ‘‘నా జీవితమంతా సినిమాల్లోనే పనిచేశాను. మీకు మంచి జీవితాన్ని ఇచ్చాను. చిత్రాల్లో రాణించడం అంత సులభం కాదు. ఇందులోకి ఎందుకు రావాలనుకుంటున్నావు. సినిమాలంటే చాలా ఇష్టం ఉంటేనే ఇందులోకి రావాలి. నువ్వు చాలా సున్నిత మనస్కురాలివి. చిత్ర పరిశ్రమలో అనేక ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని తట్టుకుని ఇక్కడ నిలబడాలి. ఆ విధంగా నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు’’ అని శ్రీదేవి జాన్వీకీ చెప్పింది. 


జాన్వీ కపూర్ తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)లో నటించింది. సిద్దార్థ్ సేన్‌గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహించాడు. సుబాస్కరన్, ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) సంయుక్తంగా నిర్మించారు. దీపక్ దోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.‘గుడ్ లక్ జెర్రీ’ డిస్నీ+హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలయింది. జులై 29నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ‘కోలమావు కోకిల’ కు రీమేకే ‘గుడ్ లక్ జెర్రీ’. జాన్వీ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడం ఇది రెండోసారి. గతంలో ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’ (Gunjan Saxena: The Kargil Girl) 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...