AP: అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

ABN , First Publish Date - 2022-03-10T13:22:46+05:30 IST

జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

AP: అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

శ్రీకాకుళం: జిల్లాలోని అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం ఉదయం సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకాయి. సుమారు 6 నిమిషాలు పాటు సూర్యనారాయణ స్వామికి కిరణ స్పర్శ తగిలింది. సూర్యకిరణాలు చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షణాయనానికి స్థాన చలనం చెందే రోజుల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిషృతం అవుతుంది. మార్చి నెల 9, 10... అక్టోబర్ నెల 2, 3 తేదీల్లో ఈ కిరణ స్పర్శ ప్రక్రియ జరగడం పరిపాటి.

Updated Date - 2022-03-10T13:22:46+05:30 IST