సింగపూర్‌లో దిగ్విజయంగా డా.మేడసాని "శ్రీమద్ భాగవత సప్తాహం"!

Published: Sat, 09 Apr 2022 20:58:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సింగపూర్‌లో దిగ్విజయంగా డా.మేడసాని "శ్రీమద్ భాగవత సప్తాహం"!

సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి', 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వసంత నవరాత్రులలో వారం రోజులపాటు నిరాటంకంగా జరిగిన "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా సుసంపన్నం అయింది. పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్, ఉగాది పర్వదినాన ప్రారంభించి, సింగపూర్ తెలుగు వారి కోసం వారంరోజుల పాటు అద్భుతంగా  భాగవత ప్రవచన  సుధను అందించారు. కార్యక్రమ ప్రారంభోత్సవంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరానంద భారతి స్వామి వారు, కుర్తాళం పీఠాధిపతిలు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు కార్యక్రమానికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులను అందించారు.

సింగపూర్‌లో దిగ్విజయంగా డా.మేడసాని "శ్రీమద్ భాగవత సప్తాహం"!

ముఖ్య అతిథి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సింగపూర్ ప్రజలందరికీ తమ తరఫున, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.  మిజోరాం గవర్నర్  కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్రావు, బిజెపి రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, టీటీడీ పూర్వ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖులు  వారం రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేర్వేరు తేదిలలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఉగాది శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

సింగపూర్‌లో దిగ్విజయంగా డా.మేడసాని "శ్రీమద్ భాగవత సప్తాహం"!

భాగవత నేపథ్యం,  ఆవిర్భావాన్ని నుంచి ప్రారంభించి, మత్స్య, కూర్మ , వరాహ నారసింహ, వామన, శ్రీకృష్ణ అవతార విశేషాలను గురించి డా. మేడసాని అద్భుతంగా ప్రసంగించారు. కథా విశేషాలతో పాటు పోతన రచనా వైశిష్ట్యం గురించి, జీవితంలో మనకు ఉపయోగపడే విధంగా భాగవత కథలు నుండి మనము నేర్చుకోవలసిన అంశాలను గురించి కూడా మాట్లాడుతూ కళ్ళకు కట్టినట్లు భాగవతాన్ని వారు అభివర్ణించారు. 


అమెరికా నుంచి డా. వంగూరి చిట్టెన్ రాజు, లావు అంజయ్య, డా. తోటకూర ప్రసాద్, మల్లిక్ పుచ్చా, బాల ఇందుర్తి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, ఆస్ట్రేలియా నుంచి విజయ తంగిరాల, భారతదేశం నుంచి డా వంశీరామరాజు, ఊలపల్లి సాంబశివరావు, మలేసియా నుంచి డా. వెంకట ప్రతాప్, డా. అచ్చయ్య రావు, హాంగ్ కాంగ్ నుంచి జయ పీసపాటి, థాయిలాండ్ నుంచి రవికుమార్ బొబ్బా, బ్రూనై నుంచి వెంకట రమణ రావు, ఇండోనేషియా నుంచి ప్రవీణ్ తమ్మినేని, యూకే  నుంచి రాజేష్ తోలేటి,  నార్వే నుంచి డా. వెంకటపతి తరిగోపుల, శ్రీని జి  , ఫ్రాన్స్ నుంచి మహేంద్ర అన్నపూర్ణ, నుంచి ఐర్లాండ్ రాధ కొండ్రగంటి, సౌదీ అరేబియా నుంచి దీపిక రావి, ఖతార్ నుంచి  ఉసిరికల తాతాజీ, వెంకప్ప భాగవతుల, ఒమాన్  నుంచి  అనిల్ కడించర్ల, బహరైన్ నుంచి  శివ యెల్లాపు, యూఏఈ నుంచి వివి సురేష్,  కువైట్ నుంచి సుధాకర్ రావు, దక్షిణాఫ్రికా నుంచి విక్రమ్ కుమార్ పెట్లూరు, యుగాండా నుంచి బూరుగుపల్లి వ్యాసకృష్ణ తదితర ప్రముఖులు కార్యక్రమంలో వేర్వేరు తేదిలలో అతిథులుగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. 

ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసాని తోపాటూ  ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందని తెలియచేసారు. చక్కని వ్యాఖ్యానంతో రాధికా మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించగా, రామాంజనేయులు చామిరాజు, సుబ్బు. వి. పాలకుర్తి, శ్రీనివాస్ కాసర్ల తదితరులు సహకరించారు.  గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని సాంకేతిక నిర్వహణలో ప్రతిరోజూ ఏడు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయింది. ప్రపంచ నలుమూలల నుంచీ తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవలిసిన ఆవశ్యకత ఉందని, తమ కార్యక్రమాన్ని తప్పక యుట్యూబ్లో వీక్షించమని నిర్వాహకులు ఆహ్వానించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.