ఇన్‌చార్జ్‌ ఎంఈవోగా శ్రీమన్నారాయణ

ABN , First Publish Date - 2021-03-06T06:08:10+05:30 IST

కందుకూరు ఇన్‌చార్జ్‌ ఎంఈవోగా ఉన్న పెద్దిరాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఇన్‌చార్జ్‌ ఎంఈవోగా శ్రీమన్నారాయణ

పెద్దిరాజును తప్పించిన అధికారులు

కందుకూరు, మార్చి 5: కందుకూరు ఇన్‌చార్జ్‌ ఎంఈవోగా ఉన్న పెద్దిరాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో కందుకూరు ఎంఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించిన సింగరాయకొండ ఎంఈవో శ్రీమన్నారాయణ కే తిరిగి ఆ బాధ్యతలను అప్పగించారు. గతంలో శ్రీమన్నారాయణ  పనితీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి హెచ్‌ఎంపాడు ఎంఈవోగా ఉన్న పెద్దిరాజుకు కందుకూరు ఎంఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే పెద్దిరాజు పనితీరుపైనా విమర్శలు రావడంతో, ఎంఈవో కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరిందని ఉపాధ్యాయ సంఘాలు, ఇటీవలి కాలంలో నిరసనలు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ఎమ్మెల్యే మహీధరరెడ్డికి, ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో శ్రీమన్నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2021-03-06T06:08:10+05:30 IST