Advertisement

పండు డార్లింగ్‌.. నీ సాంగ్‌ ‘అదిరింది’: శ్రీముఖి

Jan 24 2021 @ 21:52PM

శ్రావణ్ వైజిటి, షీతల్ భట్ జంటగా కె బిక్షపతి దర్శకత్వంలో రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న సినిమా 'మరో ప్రేమకథ'. లవ్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా 'నల్లని కాటుకా' అనే వీడియో సాంగ్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ప్రముఖ ఢీ కొరియోగ్రాఫర్ పండు. తాజాగా ఈ సాంగ్‌పై  ప్రముఖ యాంకర్ మరియు నటి శ్రీముఖి ప్రశంసలు కురిపిస్తూ..చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. 


ఆమె మాట్లాడుతూ.. ''మరో ప్రేమకథ అనే సినిమా నుంచి తాజాగా నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది, నేను  ఆ సాంగ్ చూశాను. పాట కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన పండు నాకు బాగా తెలుసు. పండు డార్లింగ్ నువ్వు  కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, సాంగ్‌లో మంచి ఎనర్జీ ఉంది. ఈ సాంగ్ లో డ్యాన్స్ పట్ల నీకున్న ఇష్టం కనపడుతుంది, నేను టీం అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మా పండు కి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను..'' అని అన్నారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్‌లో ఐటెం గర్ల్‌గా చేసిన నమ్రిత మల్ల డ్యాన్స్‌ స్టెప్స్‌ అందరినీ అలరిస్తున్నాయి.

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.