90 ఏళ్ల వృద్ధుడిని ఆదుకున్న ఐపీసీ అధికారి

ABN , First Publish Date - 2021-11-16T02:18:48+05:30 IST

సాటి మనిషిని ఆదుకోవడంలోనే మానవత్వం ఉందని శ్రీనగర్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి..

90 ఏళ్ల వృద్ధుడిని ఆదుకున్న ఐపీసీ అధికారి

శ్రీనగర్: సాటి మనిషిని ఆదుకోవడంలోనే మానవత్వం ఉందని శ్రీనగర్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారి నిరూపించారు. కష్టార్జితం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడిని ఆదుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వీధివీధి తిరిగి అమ్మకాలు సాగించే వృద్ధుడు గత కొన్నేళ్లుగా పైసాపైసా కూడగొట్టి ఒక లక్ష రూపాయలు వరకూ దాచుకున్నారు. ఇటీవల దొంగలు ఆ సొమ్ము మొత్తం దోచుకెళ్లడంతో దిక్కుతోచని పనిలో పడ్డాడు. దీనిపై చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన శ్రీనగర్ ఎస్ఎస్‌పీ సందీప్ చౌదరి..తక్షణ సాయంగా తన సేవింగ్స్ నుంచి లక్ష రూపాయల సొమ్మును వృద్ధుడికి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు. చనిపోతే తన అంత్యక్రియలు ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆ ముసలాయన సొమ్ము కూడబెట్టినట్టు సన్నిహితులు తెలిపారు.

Updated Date - 2021-11-16T02:18:48+05:30 IST