ఇంటర్‌ ఫలితాల్లో శ్రీనివాస పద్మావతి విద్యార్థుల ప్రభంజనం

ABN , First Publish Date - 2022-06-29T06:09:11+05:30 IST

ఇంటర్మీడియట్‌ 2022 వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస పద్మావతి జూ నియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

ఇంటర్‌ ఫలితాల్లో శ్రీనివాస పద్మావతి విద్యార్థుల ప్రభంజనం
ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ 2022 వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస పద్మావతి జూ నియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ద్వితీ య సంవత్సరంలో ఎంపీ సీలో 985 మార్కులు సాధించి జిల్లాస్థా యిలో 1వ ర్యాంకు సాధించగా, ఎం.అనూష 981 మార్కులతో 2వ ర్యాంకు పొం దింది. అలాగే బైపీసీలో రేష్మ 957 మార్కులతో జి ల్లా స్థాయిలో 1వ ర్యాంకు, 955 మార్కుల తో బి.భానుప్రకాష్‌ 2వ ర్యాంకు సాధించా రు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం బైపీసీలో 435 మార్కులతో నౌషిన్‌, 435 మార్కులతో సి.వైష్ణవి రా ష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడంతో పాటు జిల్లాలో 1వ ర్యాంకు సాధించగా, 433 మార్కులతో ఆఫ్రిన్‌ బేగం 2వ ర్యాంకు సాధించారు. మెదటి సంవత్సరం ఎంపీసీలో జె.శిల్ప 464 మార్కులతో జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సా ధించగా, కె.భాగ్య లక్ష్మి, కె.శివప్రసాద్‌  460 మార్కులు సా ధించారు. ఇంటర్‌ ఎంఈసీలో పి.హర్షిని 475 మార్కులతో జిల్లాలో మొదటి స్థానంలో నిలువగా సీఈసీలో అఖిల్‌ వైష్ణవ్‌ 469 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 30 మంది కళా శాల విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించగా ప్రథ మ సంవత్సరంలో 50 మంది 400 పైగా మార్కులు సా ధించాని కళాశాల ప్రిన్సిపల్‌ మురళీ ధర్‌రావు తెలిపారు. కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల బృందం వారి తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-06-29T06:09:11+05:30 IST