చెన్నూరు ఎస్‌ఐగా శ్రీనివాసులరెడ్డి

ABN , First Publish Date - 2021-04-24T04:50:36+05:30 IST

చెన్నూరు ఎస్‌ఐగా బి.శ్రీనివాసులరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరు, కమలాపురం ఎస్‌ఐలుగా విధులు నిర్వహించిన ఆయన కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తూ బదిలీపై చెన్నూరుకు వచ్చారు.

చెన్నూరు ఎస్‌ఐగా శ్రీనివాసులరెడ్డి
బాధ్యతలు తీసుకుంటున్న శ్రీనివాసులరెడ్డి

చెన్నూరు, ఏప్రిల్‌ 23: చెన్నూరు ఎస్‌ఐగా బి.శ్రీనివాసులరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరు, కమలాపురం ఎస్‌ఐలుగా విధులు నిర్వహించిన ఆయన కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తూ బదిలీపై చెన్నూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఒకవేళ అలాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ కడప ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోనున్నారు. 


Updated Date - 2021-04-24T04:50:36+05:30 IST