ఆదర్శమూర్తి... ఆరాధ్యదైవం

ABN , First Publish Date - 2021-04-21T04:30:42+05:30 IST

ఒకే మాట.. ఒకే బాణం వంటి సర్వోత్తమ లక్షణాలతో ఆదర్శ పురుషుడిగా వినుతికెక్కిన శ్రీరాముడు హైందవులందరికీ ఆరాధ్య దైవం. రాముడిని తలవని రోజు, రామ మందిరం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తికాదు.

ఆదర్శమూర్తి... ఆరాధ్యదైవం
నెల్లూరు : శబరి శ్రీరామక్షేత్రంలో కల్యాణోత్సవానికి ఏర్పాట్లు

నేడు శ్రీరామనవమి 


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 20 : 

ఒకే మాట.. ఒకే బాణం వంటి సర్వోత్తమ లక్షణాలతో ఆదర్శ పురుషుడిగా వినుతికెక్కిన శ్రీరాముడు హైందవులందరికీ ఆరాధ్య దైవం. రాముడిని తలవని రోజు, రామ మందిరం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తికాదు. యుగాలు గడిచినా రామచంద్రుడి కాలంనాటి పాలన, శ్రీరామరాజ్యం కావాలని నేటికీ ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి రాముడు జన్మించినది నవమి నాడు. సీతారాముల కల్యాణం జరిగినదీ నవమి నాడే. శ్రీరామ పట్టాభిషేకం కూనా నవమి నాడే జరిగింది. రావణుడిపై విజయం సాధించింది కూడా నవమి రోజే. అందుకే శ్రీరామ నవమి పండుగను యూవత్‌ దేశం ఘనంగా జరుపుకుంటుంది. అయితే గతేడాదిలాగే ఈ ఏడాది కూడా నవమి ఉత్సవాలకు కరోనా వైరస్‌ అడ్డంకిగా మారింది. రోజురోజుకు కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంక్షల నడుమ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్రం, ఉస్మాన్‌సాహెబ్‌పేట కోదండ రామమందిరం, బాలాజీనగర్‌ సీతారామమందిరంతోపాటు అన్ని ఆలయాల్లో ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. నెల్లూరులోని గాంధీనగర్‌ షిరిడీసాయి బాబా మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాలు బుధవారం నుంచి మూడురోజులు జరగనున్నాయి. పరిమిత సంఖ్యలో భక్తులతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సహస్రనామ పూజ జరుగుతాయని మందిరం చైర్మన్‌ మన్నెం అమర్‌నాఽథ్‌రెడ్డి తెలిపారు. ఇతర సాయిబాబా మందిరాల్లో ఏకాంతంగా శ్రీరామనవమి పూజలు జరగనున్నాయి. కాగా, నగరంలోని సంతపేట ఆంజనేయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ఆలయ చైర్మన్‌ గంధం సునీల్‌కుమార్‌, ఈవో దుర్గయ్య, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు మే 1వతేదీ వరకు జరుగుతాయి.

Updated Date - 2021-04-21T04:30:42+05:30 IST