ltrScrptTheme3

పునర్వసు దీక్షలు ప్రారంభం

Nov 25 2021 @ 01:03AM
శ్రీరామ దీక్ష స్వీకరిస్తున్న భక్తులు

భద్రాచలం, నవంబరు 24: భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభ మయ్యాయి. ఉదయం భద్రుడి కోవెలలో శ్రీరామదీక్ష స్వీక రించే భక్తుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చ కులు అనంతరం భక్తులతో శ్రీరామదీక్ష ధరింపజేశారు. కార్యక్రమంలో దేవ స్థానం ఈవో బి.శివాజీ, ఆలయ ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌ పాల్గొన్నారు. రెండుమూడు రోజులపాటు దీక్షాధారణ కార్యక్రమం జరగనుండగా.. ఈ సమయంలో దీక్షాధారులకు ఉచితంగా స్వామి దర్శనం కల్పించనున్నారు. 27రోజులపాటు అంటే డిసెంబరు 21న ముగియనున్నాయి. 

రామయ్యను దర్శించుకున్న సాంఘిక సంక్షేమశాఖ కమిషనర్‌

భద్రాచలం సీతారామచంద్రస్వామిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణ దర్శించుకున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె రాత్రి బస అనంతరం బుధవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలకగా.. అనంతరం ఆమె ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఆమె వెంట ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, వేద పండితులు చిట్టి హనుమత్‌శాస్త్రి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.