Sriramsagar ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-07-13T13:37:53+05:30 IST

వర్షాల కారణంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

Sriramsagar ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

నిజామాబాద్: వర్షాల కారణంగా శ్రీ రాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2లక్షల 35 వేల క్యూసెక్కులు,  ఔట్ ఫ్లో 1లక్షా 50 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1087 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి  సామర్థ్యం 90 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 73 టీఎంసీలుగా నమోదు అయ్యింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 30 వరద గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2022-07-13T13:37:53+05:30 IST