శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-28T15:01:39+05:30 IST

శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్ట్ 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

Nandyala: శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్ట్ 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,16,187 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,19,151 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-08-28T15:01:39+05:30 IST