Flood water: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2022-08-21T13:45:38+05:30 IST

శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద నీరు (Flood water) కొనసాగుతోంది.

Flood water: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

నంద్యాల (Nandyala): శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద నీరు (Flood water) కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,18,386 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 1,94,854 క్యూసెక్కులుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. కాగా ప్రస్తుతం 884.50 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు.. అయితే ప్రస్తుతం 212.9198 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ నుంచి జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2022-08-21T13:45:38+05:30 IST