శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-10-26T15:19:10+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,18,050 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి  వరదనీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1,18,050 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు మూడు గేట్లు ఎత్తి పది అడుగుల మేర నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం అవుట్ ఫ్లో 1, 16,623 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది.  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ 215.3263 టీఎంసీలుగా ఉంది. అటు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2020-10-26T15:19:10+05:30 IST