శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద..

ABN , First Publish Date - 2022-08-25T13:17:08+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌

శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద..

Kurnool: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.50 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-08-25T13:17:08+05:30 IST