Srisailam Reservoir: శ్రీశైల జలాశయం మూడుగేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-08T02:15:28+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వదర ప్రవాహం కొనసాగుతుండడంతో ఆదివారం డ్యామ్‌ అధికారులు జలాశయం మూడు గేట్లు పది

Srisailam Reservoir: శ్రీశైల జలాశయం మూడుగేట్లు ఎత్తివేత

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వదర ప్రవాహం కొనసాగుతుండడంతో ఆదివారం డ్యామ్‌ అధికారులు జలాశయం మూడు గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి 83,673  క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar)కు విడుదల చేశారు. ఆదివారం ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జూరాల నుంచి 41,389 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 50,904 క్యూసెక్కులు కాగా జలాశయానికి మొత్తం 92,293 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు గాను ప్రస్తుతం 884.60 అడుగులు, జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలు (TMC) గా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ  31,658 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు, డ్యామ్‌ స్పిల్‌వే మూడు గేట్లు ద్వారా 83,673 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

Updated Date - 2022-08-08T02:15:28+05:30 IST