AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

ABN , First Publish Date - 2022-08-24T15:31:09+05:30 IST

శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు 10 అడుగుల మేర ఒక గేటు

AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

Nandyala: శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు 10 అడుగుల మేర ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,55,415 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 91,227 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-08-24T15:31:09+05:30 IST