AP News: శ్రీశైలానికి భారీగా పెరిగిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-08-04T12:57:52+05:30 IST

శ్రీశైలం (Srisailam) జలాశయానికి బుధవారం వరద ప్రవాహం భారీగా నమోదయింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల

AP News: శ్రీశైలానికి భారీగా పెరిగిన ఇన్‌ఫ్లో

శ్రీశైలం: శ్రీశైలం (Srisailam) జలాశయానికి బుధవారం వరద ప్రవాహం భారీగా నమోదయింది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.  జూరాల నుంచి  44,047 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,28,985 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు కలిసి జలాశయానికి మొత్తం 1,73,282  క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 882.10 అడుగులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 199.2737 టీఎంసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 32,101 క్యూసెక్కులు, తెలంగాణ (Telangana) విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.


Updated Date - 2022-08-04T12:57:52+05:30 IST