శీశైలానికి కర్ణాటక పోలీసుల బృందం

ABN , First Publish Date - 2022-04-03T17:35:17+05:30 IST

కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయానికి వెళ్లిన కన్నడ భక్తులు, అక్కడి వ్యాపారుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల బృందం శ్రీశైలం వెళ్లింది. అక్కడి కన్నడిగుల్లో

శీశైలానికి కర్ణాటక పోలీసుల బృందం

బెంగళూరు: కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయానికి వెళ్లిన కన్నడ భక్తులు, అక్కడి వ్యాపారుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల బృందం శ్రీశైలం వెళ్లింది. అక్కడి కన్నడిగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వెళ్లినట్టు హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర శుక్రవారం ప్రకటించారు. రాయచూరు జిల్లా నుంచి ఇద్దరు ఎస్‌ఐలతోపాటు 10 మంది కానిస్టేబుళ్లు శ్రీశైలం వెళ్లారన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్టు మంత్రి తెలిపారు. మార్చి 30న అర్ధరాత్రి వాటర్‌ బాటిల్‌ కొనుగోలు విషయంలో అక్కడి వ్యాపారి, కన్నడ భక్తుల మధ్య గొడవ జరిగింది. వ్యాపారులు చాకుతో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. దీంతో కన్నడిగులు కొన్ని దుకాణాలపై దాడి చేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కల్గిన పలు వాహనాలను అక్కడివారు ధ్వంసం చేసినట్టు భక్తులు ఆరోపించారు. ఇలా వివాదం తీవ్రమవుతున్న తరుణంలో రెండు రోజుల క్రితమే రాష్ట్ర పోలీసు బృందాన్ని శ్రీశైలం పంపారు. ఉగాది పండుగ జాతరలో పెద్ద ఎత్తున కన్నడిగులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన హెల్ప్‌లైన్‌ సెంటర్‌ తరహాలో ఏర్పాటు చేసుకుని కన్నడ భక్తులకు అవసరమైన సౌలభ్యాలను సమకూర్చారు. 

Updated Date - 2022-04-03T17:35:17+05:30 IST