ఎస్‌ఆర్‌ఎంలో సరికొత్త ఆవిష్కరణ

Sep 21 2021 @ 00:48AM
ప్రయోగశాలలో పరీక్ష ఫలితాలను పరిశీలిస్తున్న డాక్టర్‌ అనిల్‌ బృందం

చేప పొలుసుల నుంచి పారదర్శక బయోటెంప్లేట్‌

 మంగళగిరి, సెప్టెంబరు 20: చేప పొలుసులపై యూవీ లైట్లను ఉపయోగించి డీఎన్‌ఏ, సీరం, ప్రొటీన్స్‌, రక్తం వంటి ఇతరత్రా రసాయనాలను సులభతరంగా విశ్లేషించే ఓ సరికొత్త ఆవిష్కరణను ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చెందిన బయోలాజికల్‌ సైన్సెన్‌ విభాగం అందుబాటులోకి తెచ్చింది. ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను డాక్టర్‌ అనిల్‌ సురేష్‌ సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం క్లినికల్‌ లాబొరేటరీల్లో వివిధ రకాల పరీక్షల కోసం టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు యూవీ స్పెకో్ట్ర ఫొటోమీటర్లను వినియోగిస్తున్నారు. ఈ విధానంలో క్వార్డ్స్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసిన క్యువేట్లో అయిదు మిల్లీలీటర్లకు తక్కువ కాకుండా శాంపిల్స్‌ను తీసుకుని స్పెక్టోమీటర్‌లో వాటిని ఉంచి రంగు, రూపు, తత్త్వం, పరిమాణం, సామఽర్ధ్యాలను విశ్లేషిస్తారు. ఈ పరీక్షలో మరింత కచ్చితత్త్వాన్ని తీసుకొచ్చేందుకు డాక్టర్‌ అనిల్‌ సురేష్‌ బృందం రీసెర్చి ప్రారంభించారు. చేప పొలుసులను శుభ్రం చేసి వాటిమీద లోవాల్యూమ్‌ శాంపిళ్లను విశ్లేషించారు. ఈ సందర్భంగా పొలుసుల్లోని హైడ్రో ఫెసిలిటీ తత్త్వం వలన కేవలం పది మైక్రో లీటర్‌ (కేవలం సింగిల్‌ డ్రాప్‌) శాంపిల్‌ కూడ విశ్లేషణకు సరిపోతుందని గమనించారు. పైగా ఈ విధానంలో ఫలితం కూడ వేగంగా కచ్చితంగా వస్తుంది. ఈ కారణంగా శాంపిల్‌కు వాడే క్యువేట్‌ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని డాక్టర్‌ అనిల్‌సురేష్‌ బృందం వివరించింది.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రీన్‌ కెమిసీ్ట్ర తన జర్నల్‌లో ఈ వినూత్న ఆవిష్కరణ గురించి ప్రచురించింది. సాధ్యమైనంత త్వరలో సస్టెయినబుల్‌ సైన్స్‌ సొల్యూషన్స్‌ పేరిట నూతన స్టార్టప్‌ను కూడా ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పరిశోధనలకు ప్రాణం పోసిన డాక్టర్‌ అనిల్‌ సురేష్‌, ఆయన విద్యార్థులు దివ్య, తరుణ్‌లను యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సత్యనారాయణన్‌, వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య వీఎస్‌రావు అభినందించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.