ఎస్సారెస్పీ గేట్ల మూసివేత

ABN , First Publish Date - 2021-07-25T06:10:44+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గడంతో అధికారులు గేట్లను మూసి వేశారు.

ఎస్సారెస్పీ గేట్ల మూసివేత

నిజామాబాద్‌, జూలైౖ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు  వరద తగ్గడంతో అధికారులు గేట్లను మూసి వేశారు. శనివారం మధ్యాహ్నం వ రకు ఎగువ ప్రాంతం నుంచి లక్షా 16వేల క్యూసెక్కుల వరద రాగా.. 25 గేట్ల ద్వారా లక్షా 11వేల 720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు.. సా యంత్రం 6గంటల వరకు ఇన్‌ఫ్లో 61,780 క్యూసెక్కులకు చేరడంతో అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1091 అ డుగులకు గాను 1089.3 అడుగులకు చేరింది. 90 టీఎంసీలకు గాను 80.177 టీ ఎంసీల నీరు నిల్వ ఉంది.

Updated Date - 2021-07-25T06:10:44+05:30 IST