8 గేట్ల ద్వారా ఎస్సారెస్పీ నీటి విడుదల

ABN , First Publish Date - 2020-10-22T06:46:45+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి జూన్‌1వ తేదీ నుంచి వరద ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టులోకి 336టీఎంసీలు చేరగా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తడంతో గోదావరి లోకి

8 గేట్ల ద్వారా ఎస్సారెస్పీ నీటి విడుదల

మెండోర, అక్టోబరు 21: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి జూన్‌1వ తేదీ నుంచి వరద ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టులోకి 336టీఎంసీలు చేరగా ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తడంతో గోదావరి లోకి 210టీఎంసీల మిగులు జలాలను విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఈఈ రామా రావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ప్రాజెక్టులోకి 37,827 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 16గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటి ని గోదావరిలోకి విడుదల చేశారు. గంట వ్యవధి లోనే ప్రాజెక్టులోకి 20,821 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో తగ్గ డంతో ఎ నిమిది గేట్ల ద్వారా గోదావరిలోకి 25వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపా రు. ప్రాజెక్టు నుంచి ఎస్కెప్‌ ఐదు గేట్ల ద్వారా 5500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తూ కాకతీయ కాలువ ద్వారా 3000క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 150క్యూసెక్కులు, వరద కాలువకు 3000 క్యూసె క్కుల నీటిని విడుదల చేసినట్టు వివరించారు. ప్రాజెక్టు నుంచి అవిరి రూపంలో 525 క్యూసె క్కులు, మిషన్‌ భగీరథకు 152క్యూసెక్కులు ఔట్‌ఫ్లో పోతుందని ఈఈ రామారావు తెలిపా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీ)లు బుధవారం సాయంత్రానికి 1090.80అడుగులు (89.212 టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని, గత సంవత్స రం ఇదే రోజు 1090.0 అడుగులు (84.410 టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని ఈఈ తెలిపారు. 

Updated Date - 2020-10-22T06:46:45+05:30 IST