ఎస్‌ఎ్‌సబీఎన్‌‘ఎయిడెడ్‌’గా కొనసాగింపుపై సంబరాలు

ABN , First Publish Date - 2022-01-23T05:18:15+05:30 IST

స్థానిక ఎస్‌ఎ్‌సబీఎన్‌ను‘ఎయిడెడ్‌’గా పునఃకొనసాగింపుపై శనివారం కళాశాలలో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.

ఎస్‌ఎ్‌సబీఎన్‌‘ఎయిడెడ్‌’గా కొనసాగింపుపై సంబరాలు

అనంతపురం విద్య, జనవరి 22: స్థానిక ఎస్‌ఎ్‌సబీఎన్‌ను‘ఎయిడెడ్‌’గా పునఃకొనసాగింపుపై శనివారం కళాశాలలో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. గతంలో ఎయిడెడ్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో విద్యార్థులు, సంఘాల నాయకులు ధర్నా చేయడం, వారిపై పోలీసులు దాడులు చేయడంతో పెద్దదుమారం రేగింది. భారీ ఉద్యమంగా నడవటంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీంతో ఆఖరికి యాజమాన్యంపై అన్నివర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎయిడెడ్‌గా కొనసాగించేలా లేఖలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 కళాశాలలను పునఃఎయిడెడ్‌గా గుర్తించారు. అందులో ఎస్‌ఎ్‌సబీఎన్‌కు చోటు దక్కింది. దీంతో సంబరాలు చేసుకున్నారు. ఇతర కళాశాలలకు వెళ్లిన టీచింగ్‌ స్టాఫ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ తిరిగి కళాశాలకు రావడంతో విద్యార్థులు, సంఘాల నాయకులు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాలను‘ఎయిడెడ్‌’గా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను బలోపేతం చేయడం కోసం, జీవో 35 రద్దయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుతప్రసాద్‌, అష్రాఫ్‌ వలీ, విష్ణువర్ధన్‌, వంశీ, దూద్‌పీరా, నాగభూషణ, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:18:15+05:30 IST