గాజులపేటలో యువకుడికి కత్తిపోట్లు

ABN , First Publish Date - 2022-05-13T06:39:45+05:30 IST

నిర్మల్‌ పట్టణం లోని గాజులపేటలో జుబేర్‌(21) అనే యువ కుడిని గురువారం ఫయాజ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు.

గాజులపేటలో యువకుడికి కత్తిపోట్లు
కత్తిపోట్లకు గురైన యువకుడు

హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

నిర్మల్‌ చైన్‌గేట్‌, మే 12 : నిర్మల్‌ పట్టణం లోని గాజులపేటలో జుబేర్‌(21) అనే యువ కుడిని గురువారం ఫయాజ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జుబేర్‌ గాజులపేటలో ఫయాజ్‌ అనే వ్యక్తి ఇంట్లో అద్దె కు ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఇంటి యజ మాని ఫయాజ్‌ భార్యతో ఆయనకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఫయాజ్‌కు ఈ విష యం తెలిసిపోవడంతో ఆయన జుబేర్‌ను రోడ్డుపై కత్తితో పొడిచి తీవ్రంగా గాయ పరి చాడు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. అక్కడి డాక్టర్లు ఆయనకు చికిత్స నిర్వ హిస్తుండగానే మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

Read more