కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్థిర పాలన

ABN , First Publish Date - 2022-08-10T05:25:37+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని, దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్థిర పాలన
బోయలగూడెం నుంచి పాదయాత్రగా వస్తున్న పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, మల్లురవి

- జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి

- బోయలగూడెం నుంచి ఆజాదీ గౌరవ్‌ పాదయాత్ర ప్రారంభం

గట్టు, ఆగస్టు 9:  కాంగ్రెస్‌ పార్టీతోనే దేశంలో సుస్థిర పాలన సాధ్యమని, దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బోయలగూడెం గ్రామం నుంచి సోమవారం ఆయన ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రను ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని తిమ్మప్ప స్వామి అల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేశారు. బోయలగూడెం, ఇందువాసి, చమన్‌ఖాన్‌దొడ్డి, బల్గెర, మాచర్ల, గట్టు గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావే శంలో ప్రభాకర్‌రెడ్డి  మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్పప్పుడు  చేపట్టిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని, టీఅర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శిం చారు. గ్రామగ్రామాన కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరి స్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బల్గెర నారాయణ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకులు మాచర్ల వెంకటస్వామి గౌడు, వీరబాబు, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, అలెగ్జాండర్‌, మండల అద్యక్షులు ఎండీ గౌస్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మన్‌, మైనార్టీ అధ్యక్షుడు మాభాష, మాజీ సర్పంచ్‌ ఆరగిద్ద నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 


టీఅర్‌ఎస్‌ పార్టీని  సాగనంపండి

టీఅర్‌ఎస్‌ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఆ పార్టీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి విమర్శిం చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరిం చుకొని మండలంలోని బోయలగూడెం నుంచి ప్రారం భమైన ఆజాదీకా గౌరవ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ సుస్థిర పాలన అందించలేకపోతున్నదన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. సుస్థిర పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ఆ దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. 

Updated Date - 2022-08-10T05:25:37+05:30 IST