ఏడాదిన్నరైనా అతీగతీ లేని వైనం

ABN , First Publish Date - 2020-07-06T10:48:24+05:30 IST

జిల్లాకు మంజూరైన క్రీడామైదానాల నిర్మాణంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రు.

ఏడాదిన్నరైనా అతీగతీ లేని వైనం

కరోనాతో మూతపడిన స్టేడియాలు


అనంతపురం క్లాక్‌టవర్‌, జులై 5 : జిల్లాకు మంజూరైన క్రీడామైదానాల నిర్మాణంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రు. దీంతో ఏడాదిన్నరగా స్టేడియాల పరిస్థితి అతీగతీ లేకుండా పోయింది. గతేడాది జి ల్లాకు 18 స్టేడియాలు మంజూరు చేశారు. ఇందులో నాలుగు క్రీడామైదానాలు పూర్తి చే శారు. మిగిలిన 14స్టేడియాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇందులో అనంతపురం నగరానికి మంజూరు చేసిన స్టేడియానికి ఇంత వరకు స్థలసేకరణలోనే ఉండిపోయారు. ఇదిలా ఉంటే ఉన్న అరకొర స్టేడియాలు కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. దీంతో క్రీడాకారులు సాధన చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు.  


జిల్లాకు 18 క్రీడామైదానాలు కేటాయింపు 

గత ప్రభుత్వం జిల్లాకు 18 క్రీడామైదానాలు కేటా యించి నిధులు మంజూరు చేసింది. ఒ క్కో స్టేడియానికి రూ.2కోట్లు చొప్పున రూ. 36కోట్లు నిధులు ఇచ్చారు. ఇందు లో నార్ప ల, కళ్యాణదుర్గం, రామగిరి, పెనుకొండలలో క్రీడామైదానాలు పూర్తి చేశారు. రాయదుర్గం, కొత్తచెరువు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, గార్లదిన్నె కల్లూరు, మడకశిర, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండలలో క్రీడామైదానాలు నిర్మాణంలో ఉన్నాయి. కదిరి, శింగనమల, ఆత్మకూరు, ముదిగుబ్బలలో ఇంతవ ర ్డకు నిర్మాణాలే ప్రారంభించలేదు. ఇక అనంతపురం నగరంలో ఇప్పటికీ స్థలసేకరణలోనే ఉన్నా రు. ఏడాదిన్నర పూర్తి అవుతున్నా సగం నిర్మాణంలో ఉండగా, మరొక్కటి స్థలం లేక ఇంత వరకు నిర్మాణం ప్రారంభించలేదు.


కరోనా లాక్‌డౌన్‌తో క్రీడాకారుల అవస్థలు 

కరోనా లాక్‌డౌన్‌తో క్రీడాకారులు తమ ఆట ల సాధనకు మైదానాలకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. క్రీడాకారులు వరుసగా నాలుగు నెలల పాటు సాధన లేకుండా ఉండడంతో క్రీడపై ఆసక్తి, నైపుణ్యత తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీలకు వెళ్లే క్రీడాకారులు ఇలా సాధన లేకుండా ఉండాలంటే కష్టమంటున్నారు.  


నిర్మాణాలలో ఇబ్బందులు నిజమే .. జగన్నాథ్‌రెడ్డి జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ చీఫ్‌కోచ్‌

జిల్లాకు మంజూరైన క్రీడామైదానాల నిర్మాణంలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. హౌసింగ్‌ శాఖ ఈ క్రీడామైదానాల నిర్మాణం చేపడుతోంది. ఇసుక సమస్యతో కొన్ని రో జులు నిర్మాణాలు నిలిపివేశారు. దీంతో నిర్మాణాలు నిదానంగా జరుగుతున్న మాట నిజం. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌తో పూర్తిగా పనులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌తో క్రీడామైదానాల నిర్మాణాలు నిలిచిపోగా, ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టేడియాలు మూసివేశాం



Updated Date - 2020-07-06T10:48:24+05:30 IST