క్రీడాకారులను ప్రోత్సహించేందుకే క్రీడాప్రాంగణాలు

ABN , First Publish Date - 2022-05-26T07:14:45+05:30 IST

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే క్రీడాప్రాంగణాలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

భైంసా రూరల్‌, మే 25 : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను గుర్తిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. బుధవారం మండలంలోని వట్టోలి గ్రామంలో జిల్లా అధికారులకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణస్థాయిలో క్రీడాకారులను గుర్తించేందుకు ప్రతి మండలంలో ఐదు క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుందని వెల్లడించారు. అన్నిరకాల హంగులతో క్రీడా ప్రాంగణాలను ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పెంపొం దించుకునేందుకు ఎంతో దోహదపడుతాయన్నారు. యువత సైతం క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. స్థానికంగా క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యతసైతం మండలస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడల్లోకి వెళ్లాలని ఆకాంక్షిం చారు. సాధ్యమైనంత త్వరగా ప్రాంగణాలను గుర్తించి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బృహత్‌పల్లె ప్రకృతివనంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. అక్కడి నుండి గ్రామాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నిఖిత సచిన్‌, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీపీ శ్రీలత, డీఆర్‌డీవో విజయలక్ష్మీ, జడ్పీ సీఈవో సుఽధీర్‌, డీఎల్‌పీవో శివకృష్ణ, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంపీడీవో గంగాధర్‌తో పాటు జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-26T07:14:45+05:30 IST