అర్హులైన జర్నలిస్టులకు దశల వారీగా అక్రిడిటేషన్లు

ABN , First Publish Date - 2021-07-25T05:45:55+05:30 IST

జిల్లాలో అర్హు లైన జర్నలిస్టులందరికీ దశల వారీగా అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.

అర్హులైన జర్నలిస్టులకు దశల వారీగా అక్రిడిటేషన్లు

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 24 : జిల్లాలో అర్హు లైన జర్నలిస్టులందరికీ దశల వారీగా అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరే ట్‌లోని తన ఛాంబర్‌లో శనివారం జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. అంతకు ముం దు సమాచారపౌరసంబంధాలశాఖ సహాయ సం చాలకులు, కమిటీ కన్వీనర్‌ మోహన్‌రాజు మాట్లా డుతూ 2021-22 ఆర్థికసంవత్సరానికి అక్రిడిటేషన్ల కోసం ఆన్‌లైన్‌లో 2,887 దరఖాస్తులు వచ్చాయన్నా రు. వీటిలో పెద్దపత్రికలు, శాటిలైట్‌ టీవీఛానళ్ళ త రుపున 701 దరఖాస్తులు వచ్చాయని, మగతావి చి న్నపత్రికలు, కేబుల్‌ ఛానళ్ల తరపున వచ్చినట్లు వె ల్లడించారు. వాటిపై స్పందించిన కలెక్టర్‌ మాట్లాడు తూ ముందుగా పెద్దపత్రికలు, శాటిలైట్‌ టీవీ ఛాన ళ్ళలో పనిచేస్తున్న అర్హుల జాబితాను బుధవారంలో పు ఖరారు చేయాలని ఆదేశించారు. అనంతరం అ ర్హత పొందలేక పోవడానికి గల కారణాలను కూడా పాత్రికేయుల దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. చిన్నపత్రిక లు, ఛానళ్లలో పనిచేస్తున్న వారి దరఖాస్తులను కూ డా పరిశీలించి అర్హత మేరకు త్వరలోనే అక్రిడిటేష న్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ సమా వేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో పద్మావతి, హౌసిం గ్‌ అధికారి శేషుబాబు, కార్మికశాఖ డిప్యూటీ కమిష నర్‌ శ్రీనివాసకుమార్‌, ఆర్టీసీ ఆర్‌ఎం విజయగీత, ఒంగోలు రైల్వే స్టేషన్‌ ఎస్‌ఎం ఏసుదానం తదితరు లు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T05:45:55+05:30 IST