ఒమైక్రాన్... అమెరికా మార్కెట్ ప్రతిష్టంభనకు కారణం.....!

ABN , First Publish Date - 2021-11-30T02:14:12+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ‘ఒమైక్రాన్’ నేపధ్యంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌ను తొమ్మిదికి పైగా దేశాలు నివేదించిన విషయం తెలిసిందే.

ఒమైక్రాన్... అమెరికా మార్కెట్ ప్రతిష్టంభనకు కారణం.....!

న్యూయార్క్ : కరోనా కొత్త వేరియంట్ ‘ఒమైక్రాన్’ నేపధ్యంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌ను తొమ్మిదికి పైగా దేశాలు నివేదించిన విషయం తెలిసిందే. వీటితోపాటు మరికొన్ని దేశాల్లో కూడా సాధారణ జీవనస్థితికి అంతరాయమేర్పడినట్లు  కనిపిస్తోంది. అధిక ఇన్‌ఫెక్షన్ ప్రభావం, వ్యాక్సీన్‌ను కూడా ఇది అధిగమిస్తోందని వినిపిస్తోన్న నేపధ్యంలో... ఒమైక్రాన్‌ను...  ఆందోళన కలిగిచే వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒమైక్రాన్ నేపధ్యంలో... దక్షిణాఫ్రికా దేశాల నుండి అమెరికా, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలకు ప్రయాణాలపై ఆంక్షలు చోటుచేసుకున్నాయి.


ఒమైక్రాన్‌ను నియంత్రించడంపై ప్రపంచం దృష్టి సారించిన సమయంలో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫియర్ ఇండెక్స్ VIX శుక్రవారం తొమ్మిది పాయింట్లకు పైగా పెరిగి, 27 ను దాటింది. కొత్త వేరియంట్ భయంతో డిమాండ్ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో చమురు ధరలు ఏకంగా పది శాతం క్షీణించాయి. అమెరికా ప్రభుత్వ బాండ్లు గత ఏడాది కాలంలోనే అతిపెద్ద వన్డే మూవ్‌ను నమోదు చేసుకున్నాయి. 

Updated Date - 2021-11-30T02:14:12+05:30 IST