కమీషన్ల కోసమే కొత్త పథకాలు

ABN , First Publish Date - 2021-01-22T14:04:36+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తాను నిర్వహిస్తున్న ప్రజాపనుల శాఖలో కమీషన్ల కోసమే కొత్త పథకాలను ప్రకటించి, అత్యవసరంగా టెండర్లను కూడా ఖరారు చేస్తున్నారని ...

కమీషన్ల కోసమే కొత్త పథకాలు

3 నెలల్లో రూ.2855 కోట్లకు టెండర్లు

సర్కారుపై స్టాలిన్‌ ధ్వజం


చెన్నై1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తాను నిర్వహిస్తున్న ప్రజాపనుల శాఖలో కమీషన్ల కోసమే కొత్త పథకాలను ప్రకటించి, అత్యవసరంగా టెండర్లను కూడా ఖరారు చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రజాపనుల శాఖలో గత మూడు నెలల్లో రూ. 2855 కోట్లకు పైగా విలువైన పనులకు సంబంధించిన టెండర్లు జారీ చేయడంతోపాటు వాటిని ఖరారు చేస్తూ అత్యవసరంగా సంతకాలు కూడా పెడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ త్వరలో  రానుండటంతో తమ ప్రభుత్వానికి చివరి రోజులు సమీపిస్తుండటంతో కమీషన్లు దండుకునే నిమిత్తం ముఖ్యమంత్రి ప్రజాపనుల శాఖలో నవంబర్‌ నుంచి జనవరి వరకు టెండర్లను ఖరారు చేస్తూ సంతకాలు పెట్టేస్తున్నారని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఎడప్పాడి సీఎం పదవిని చేపట్టినప్ప టి నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిర్వహిస్తున్న టెండర్లలో పారదర్శకత పాటించ డం లేదని తాను పలుమార్లు ఆరోపించినా పట్టించుకోలేదన్నారు. అధికారం కోల్పోనున్న సమయంలో ఎడప్పాడి చేస్తున్న ఈ అవతవకలకు ఆయా శాఖలకు చెందిన అధికారులు కూడా సాయ పడుతున్నారని ఆయన ఆరోపించారు. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడానికి, వంద రోజుల పని పథకాని కి నిధులు లేవన్న ఎడప్పాడి తన ప్రజాపనుల శాఖలోని పనులకు మాత్రమే కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి కొత్త పథకాలకు టెండర్లు పిలిచి ఆమోదించడం గర్హనీయమని స్టాలిన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-22T14:04:36+05:30 IST