నీ న్యూడ్ ఫొటోలు పంపు.. లేదంటే ఇల్లు తగలబెట్టేస్తా.. అంటూ బెదిరింపు లేఖ!

ABN , First Publish Date - 2022-06-03T09:23:02+05:30 IST

ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళను ఒక కామాంధుడు భయపెట్టడం మొదలు పెట్టాడు. రకరకాల బెదిరింపులతో లేఖలు పంపేవాడు. దీంతో సదరు మహిళకు భయంతో నిద్రపట్టేదికాదు. ఈ ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది...

నీ న్యూడ్ ఫొటోలు పంపు.. లేదంటే ఇల్లు తగలబెట్టేస్తా.. అంటూ బెదిరింపు లేఖ!

ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళను ఒక కామాంధుడు భయపెట్టడం మొదలు పెట్టాడు. రకరకాల బెదిరింపులతో లేఖలు పంపేవాడు. దీంతో సదరు మహిళకు భయంతో నిద్రపట్టేదికాదు. ఈ ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా నివసించే మహిళకు ఇంటి లెటర్ బాక్సులో ఒక లేఖ కనిపించింది. దానిలో ఏముందో చూసిన ఆమె షాకైంది. ‘‘నీవి రెండు నగ్న ఫొటోలు పంపించు. ఒకటి ముందు వైపుది, రెండోది వెనుక వైపుది. లేదంటే నీ ఇల్లు తగలబెట్టేస్తాను’’ అని ఆ లేఖలో ఉంది. అది చూసిన ఆమె భయంతో వణికిపోయింది. ఆ తర్వాత కూడా ఇలాంటివే కొన్ని లెటర్లు వచ్చాయి. 


ఆ ఉత్తరాల్లో ఉన్న రైటింగ్ చూసి ఎవరో పిల్లాడేమో అని ఆమె అనుకుంది. కానీ సీసీకెమెరాలో చూసి షాకైంది. వెంటనే పోలీసులను సంప్రదించి, సీసీ ఫుటేజితోపాటు లెటర్ కూడా వారికి అందజేసి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. గారీ బ్రెడ్‌వుడ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గారీ.. బాధితురాలి ఇంటి సమీపంలోనే నివసించేవాడు. అతను గతంలో కూడా ఇలాంటి పనులే చేశాడని, మాల్స్‌కు వెళ్లి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు గ్యారీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-06-03T09:23:02+05:30 IST