Wedding: తాళి కట్టే సమయంలో ఆగిపోయిన పెళ్లి

ABN , First Publish Date - 2022-08-10T21:01:15+05:30 IST

ఓ ఫంక్షన్ హాలు (Function hall)లో జరుగుతున్న పెళ్లి తాళి కట్టే సమయంలో ఆగిపోయింది.

Wedding: తాళి కట్టే సమయంలో ఆగిపోయిన పెళ్లి

మంచిర్యాల (Machiryala): జిల్లాలోని ఓ ఫంక్షన్ హాలు (Function hall)లో జరుగుతున్న పెళ్లి (Wedding) తాళి కట్టే సమయంలో ఆగిపోయింది. పెళ్లి కొడుకు తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని పెళ్లి మండపానికి వచ్చిన ఓ యువతి వివాహాన్ని అడ్డుకుంది. పెళ్ళికొడుకు నిర్వాకంతో కొత్త పెళ్లి కూతురు వివాహాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఫంక్షన్ హాల్లో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.


మందమర్రి మండలానికి చెందిన ఓ యువకుడికి, వరంగల్‌కు చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మంచిర్యాల జిల్లా, గద్దె రేగడిలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి మండపానికి వచ్చి తాళికట్టే సమయంలో పెళ్లి  కొడుకు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని, తనకు న్యాయం చేయాలని ఆ యువతి అక్కడే బైఠాయించింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-08-10T21:01:15+05:30 IST