యూపీ: కాంగ్రెస్ ర్యాలీలో తొక్కిసలాట

ABN , First Publish Date - 2022-01-05T00:08:21+05:30 IST

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు కొవిడ్ దేశాన్ని కుదిపివేస్తున్నా ఎన్నికల ప్రచారాలకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. అన్ని పార్టీలు పోటాపోటీగా ఎన్నికల కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు..

యూపీ: కాంగ్రెస్ ర్యాలీలో తొక్కిసలాట

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు కొవిడ్ దేశాన్ని కుదిపివేస్తున్నా ఎన్నికల ప్రచారాలకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. అన్ని పార్టీలు పోటాపోటీగా ఎన్నికల కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీ తొక్కిసలాటకు దారి తీసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ‘లక్కీ హూ.. లడ్ సక్‌తీ హూ’ (నేను బాలికను, నేను పోరాడతాను) అనే నినాదం ఉత్తరప్రదేశ్‌లో అమితంగా ఆదరణ పొందింది. ఈ పేరుతోనే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇందులో భాగంగా మంగళవారం బాలికలతో మారథాన్ నిర్వహించారు. ఇందులో వేలాది మంది బాలికలు పాల్గొన్నారు. అయితే అందరు ఒకే గుంపుగా వచ్చారు. ఇదే సమయంలో కొంత మంది మారథాన్‌ను కాసుపు ఆపాలని ప్రయత్నించారు. కానీ మారథానీలు పెద్ద ఎత్తున ఉండడంతో వెనకాల ఉన్నవారి ఒత్తిడికి ముందు ఉన్నవారు కింద పడిపోయారు. అయితే ఈ తొక్కిసలాటలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కాంగ్రెస్ వర్గీయులు తెలిపారు.

Updated Date - 2022-01-05T00:08:21+05:30 IST