16000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

ABN , First Publish Date - 2022-05-16T06:28:11+05:30 IST

16000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

16000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

సోమవారం స్థాయిలు

నిరోధం : 15920, 16000

మద్దతు : 15800, 15740


నిఫ్టీ గత వారం నెగెటివ్‌ ట్రెండ్‌లో ప్రారంభమై వారం అంతా అదే ధోరణి కొనసాగించింది. కీలక మానసిక అవధి 16000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై చివరికి 630 పాయింట్ల నష్టంతో 15780 వద్ద వారానికి ముగింపు పలికింది. అలాగే వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసింది. గత నాలుగు వారాల్లో అథోముఖంగానే ట్రేడవుతూ 2200 పాయింట్ల వరకు కోల్పోయింది. టెక్నికల్‌గా మార్కెట్‌ స్వల్పకాలిక కరెక్షన్‌ ట్రెండ్‌లోనే ఉన్నా ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం ఓవర్‌సోల్డ్‌ స్థితి ఏర్పడింది. 16000 వద్ద బ్రేక్‌డౌన్‌ కూడా ఏర్పడింది. ఇప్పుడు పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది. 


ఈ టెక్నికల్‌ రికవరీలో మార్కెట్‌ 16000 స్థాయిలో మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు. అప్‌ట్రెండ్‌ను కొనసాగించాలంటే ఈ పరీక్షలో కన్సాలిడేట్‌ అయి నిలదొక్కుకోవడం తప్పనిసరి. పైగా ప్రస్తుతం మధ్యకాలిక మద్దతు స్థాయి 15800 వద్ద ఉంది. గత ఏడాది జూన్‌, జూలై నెలల్లో ఈ స్థాయిలోనే కన్సాలిడేషన్‌  ఏర్పడింది.   

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌లో ప్రయాణించినట్టయితే గత రెండు రోజుల్లో ఏర్పడిన గరిష్ఠ స్థాయి, టాప్‌ 16000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. ప్రధాన నిరోధం 16250. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది. 

మరో ప్రధాన నిరోధం 16500 (ఈ నెల 6వ తేదీన ఏర్పడిన ప్రధాన గరిష్ఠ స్థాయి). 

బేరిష్‌ స్థాయిలు: ప్రస్తుత మద్దతు స్థాయి 15800 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే మరింత స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. మరో ప్రధాన మద్దతు స్థాయి 15500 (గత ఏడాది జూలై 28న ఏర్పడిన కనిష్ఠ స్థాయి) 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం బలహీనంగానే ప్రారంభమై చివరికి 1500 పాయింట్ల నష్టంతో  33100 వద్ద ముగిసింది. ప్రస్తుతం ప్రధాన మానసిక అవధి 33000కు చేరువలో ఉంది. ఇక్కడ మైనర్‌ రికవరీకి అవకాశం ఉంది. ఆ పైన నిరోధ స్థాయి 34000. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్‌ ఉంటుంది.

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 15800 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ఉంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ కన్సాలిడేట్‌ కావాలి. అలాగే ప్రస్తుతం ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ సమీపంలో ఉంది. దాని కన్నా పైకి వచ్చినట్టయితే మైనర్‌ రికవరీ ఏర్పడవచ్చు. అయితే నిఫ్టీ ప్రస్తుతం 100, 200 డిఎంఏల కన్నా దిగువన ఉంది. 

టైమ్‌: వీక్లీ చార్టుల ప్రకారం ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది. బుధవారం మైనర్‌ స్వల్పకాలిక రివర్సల్‌ ఉండవచ్చు.


Updated Date - 2022-05-16T06:28:11+05:30 IST