
‘అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య ప్రేమ యుద్ధం’ అంటూ మే 16వ తేదీ నుండి ‘స్టార్ మా’ (Star Maa)లో సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కాబోతున్న సీరియల్ ‘నువ్వు... నేను... ప్రేమ’ (Nuvvu Nenu Prema). ఆత్మగౌరవం కలిగిన ఓ అమ్మాయి... అహంకారంతో పొగరుగా వ్యవహరించే ఓ అబ్బాయి నడుమ చిగురించిన ప్రేమ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సీరియల్ ప్రోమోలతోనే మహిళల మనసులను గెలుచుకోవడమే కాదు, వారు ఆసక్తిగా దీని కోసం ఎదురుచూసేలాగానూ చేసింది. ఈ సీరియల్లో కథానాయిక పద్మావతి (Padmavathi)లా ఆత్మాభిమానంతో రాణించాలనే మహిళలకు ఓ సువర్ణావకాశం కల్పించింది స్టార్ మా.
తమ కెరీర్లో రాణించడం మాత్రమే కాదు తమంతట తాముగా ఎక్కడికైనా వెళ్లగలమని, స్వాభిమానంతో వ్యవహరించే మగువలకు మోపెడ్ నడపడంలో శిక్షణ అందించింది స్టార్ మా. ఆసక్తి కలిగిన మహిళలను ఎంపిక చేసి.. వారికి నిపుణుల పర్యవేక్షణలో మోపెడ్ నడపడంలో శిక్షణ ఇప్పించింది. ఈ శిక్షణ పొందిన మహిళలకు ‘నువ్వు... నేను... ప్రేమ’ సీరియల్లోని పద్మావతిని కలుసుకునే అవకాశం కల్పించింది.
బోయిన్పల్లి పరిసర ప్రాంతాలలో నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో.. మహిళలు పద్మావతిని కలవడం మాత్రమే కాదు, ఆమెతో మోపెడ్‌పై ప్రయాణం చేస్తూ ఫోటోలనూ దిగారు. అహంకారానికి... ఆత్మగౌరవానికి మధ్య ప్రేమ యుద్ధంగా మే 16వ తేదీ నుంచి ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకూ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం కానున్న ఈ సీరియల్.. ఎన్నో మలుపులు.. మరెన్నో ఆసక్తికర సన్నివేశాల సమాహారంగా రూపుదిద్దుకుందని, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని స్టార్ మా యాజమాన్యం భావిస్తోంది.