ఎయిర్‌పోర్టులో అనుమాస్పదంగా పడి ఉన్న బాక్సులు.. తెరచి చూస్తే అందులో స్మగ్లర్లు ఏం తరలిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-01-06T10:15:39+05:30 IST

కస్టమ్స్ అధికారులుద ఎయిర్‌పోర్టులలో విస్తృత తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగర్లు మాత్రం అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక మార్గంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు ఎన్నుకుంటున్న మార్గాలు చూసి పోలీసులు, కస్టమ్స్ అధికారులు షాక్‌కు గురవుతున్నారు. తాజాగా కేటుగాళ్లు అరుదైన నక్షత్ర తాబేళ్లను దేశం దాటించే ప్రయత్నం చేశారు...

ఎయిర్‌పోర్టులో అనుమాస్పదంగా పడి ఉన్న బాక్సులు.. తెరచి చూస్తే అందులో స్మగ్లర్లు ఏం తరలిస్తున్నారంటే..

కస్టమ్స్ అధికారులుద ఎయిర్‌పోర్టులలో విస్తృత తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగర్లు  మాత్రం అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక మార్గంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు ఎన్నుకుంటున్న మార్గాలు చూసి పోలీసులు, కస్టమ్స్ అధికారులు షాక్‌కు గురవుతున్నారు. తాజాగా కేటుగాళ్లు అరుదైన నక్షత్ర తాబేళ్లను దేశం దాటించే ప్రయత్నం చేశారు. 


గడచిన కొద్ది సంవత్సరాలుగా నక్షత్ర తాబేళ్లు సంఖ్య భరీగా తగ్గిపోతోంది. ఇవి అంతరించి పోతున్న వన్యప్రాణుల లిస్ట్‌లో చేరిపోయాయి. వాటి విలువ గుర్తించిన స్మగ్లర్లు మాత్రం అడవులను జల్లెడ పడుతూ కనిపించిన నక్షత్ర తాబేళ్లను బాక్సుల్లో బంధించేస్తున్నారు. అరుదైన వన్య సంపదను దేశాలు దాటించేసి.. లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. 




తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో కార్గో కస్టమ్స్ అధికారులు 1364 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి సమీపంలోని మీనంబాక్కంలో ఉన్న ఎయిర్ కార్గో ఎక్స్‌పోర్ట్ షెడ్‌లో వన్యప్రాణులను కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేశారు. మొత్తం 230 కొలోల తాబేళ్లను లిస్టులో పీతలుగా చూపి స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఈ బాక్సులు రిస్క మేనేజ్‌మెంట్ సిస్టమ్‌గా ముద్ర ఉండడంతో వీటిని సాధారణంగా ఎవరూ తెరిచి పరిశీలించారు.


వాటిని మలేషియాకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నాయి. అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖకు అప్పగించారు.


ఈ నక్షత్ర తాబేళ్లకు చైనా, ఇండోనేషియా, మలేషియా, జపాన్ లాంటి దేశలలో భారీ డిమాండ్ ఉంది. సాధారణంగా తాబేలు జీవితకాలం  కొన్ని వందల సంవత్సరాలు వరకు ఉంటుంది. దీనిని ఇంట్లో పెంచుకుంటే ఆయుషు పెరుగుతుందని ఆయా దేశాలలో ఒక మూఢనమ్మకం ఉంది. దీంతో అక్కడ వీటికి మంచి ధర పలుకుతోంది. అక్కడి ప్రజలు నక్షత్ర తాబేళ్లను బహుమతులుగా ఇచ్చుకుంటారు.

Updated Date - 2022-01-06T10:15:39+05:30 IST