పాల సేకరణ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-29T05:57:41+05:30 IST

మండలంలోని కే పూలకుంట గ్రామంలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సిరి ప్రారంభించారు.

పాల సేకరణ కేంద్రం ప్రారంభం
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ సిరి

నల్లచెరువు, జనవరి 28: మండలంలోని కే పూలకుంట గ్రామంలో శుక్రవారం జగనన్న పాలవెల్లువ పాల సేకరణ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ సిరి ప్రారంభించారు.   ఈ గ్రామంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో మొదట పాల సేకరణ ఈ గ్రామం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని రైతులు సహ కరించి, జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రానికి పాలు సరఫరా చేయాల న్నారు. పది రోజులకు ఒకసారి పాల బిల్లులు మహిళల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయ డం జరుగుతుందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా అన్ని చర్యలు పూర్తి అయ్యాయని తెలిపారు. పాల ఉత్పత్తి నాణ్యతను పెంపొందించేందుకు పశు వులకు దాణా అమూల్‌ కంపెనీ వారు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శకుంతల, ఎంపీపీ రమణారెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, వైసీపీ సీనియర్‌ నాయకులు లక్ష్మీపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:57:41+05:30 IST